ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సోనాల్ గట్టి ప్రయత్నమే చేస్తోంది!

Fri, Sep 09, 2016
సోనాల్ చౌహాన్
సోనాల్ చౌహాన్
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో సోనాల్ చౌహాన్ పేరు కూడా చెప్పుకోవచ్చు. లెజెండ్ .. పండగ చేస్కో .. డిక్టేటర్ వంటి చిత్రాలు ఈ భామకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అమ్మడి గ్లామర్ కి .. అందాలు ఆరబోసే తీరుకి కుర్రకారు నుంచి మార్కులు బాగా పడిపోయాయి.

దాంతో వరుస అవకాశాలతో ఈ అమ్మాయి దూసుకుపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడా ఈ సుందరి సందడి కనిపించడం లేదు. రెండవ కథానాయికగా కూడా ఛాన్సులు రాకపోతుండటంతో, తాజాగా ఈ చిన్నది హాట్ ఫోటో షూట్ చేయించింది. కాస్త వెనకబడిపోయినప్పుడు కొంతమంది కథానాయికలు చేస్తోన్న ప్రయత్నమే తనూ చేసింది. ఈ ఫోటో షూట్ తో అటు బాలీవుడ్ లోను .. ఇటు టాలీవుడ్ లోను ఛాన్సులు కొట్టేయాలని చూస్తోంది. సోనాల్ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)