ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఇజం'లో గెస్టుగా ఎన్టీఆర్?

Fri, Sep 09, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త హల్ చల్ చేస్తోంది. 'ఇజం' సినిమాలో ఎన్టీఆర్ గెస్టుగా కనిపించే అవకాశం ఉందనేది ఆ వార్త సారాంశం. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా పూరి దర్శకత్వంలో 'ఇజం' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ప్రాధాన్యతను సంతరించుకున్న ఒక గెస్టు రోల్ ఉందట. ఆ పాత్రను ఎన్టీఆర్ తో చేయించడం ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. రీసెంట్ గా ' జనతా గ్యారేజ్' బంపర్ హిట్ కొట్టడం వలన ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరిగింది. అందువలన 'ఇజం'లో ఆయన కనిపిస్తే ఆ తీరే వేరుగా ఉంటుందని అనుకుంటున్నారని సమాచారం. కల్యాణ్ రామ్ తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని గతంలో ఒక సందర్భంలో ఎన్టీఆర్ అన్నాడు. అందువలన పూరి - కల్యాణ్ రామ్ కోరితే, గెస్టు రోల్ చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)