ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మూవీలో మెసేజ్ అదేనట!

Thu, Sep 08, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
కొరటాల శివ తన ప్రతి సినిమా ద్వారా ఒక సందేశాన్ని ఇస్తుంటారు. ఆ సందేశం కథలో కలిసిపోయి ఆలోచింపజేస్తుంది. 'శ్రీమంతుడు' సినిమాలో గ్రామాల దత్తత గురించి చెప్పిన కొరటాల, 'జనతా గ్యారేజ్' లో పచ్చదనం .. మొక్కల పెంపకం గురించి చెప్పుకొచ్చారు. ఆయన తదుపరి సినిమాలోను ఓ మెసేజ్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.

కొరటాల తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పటి నుంచి ఈ సినిమా లైన్ ఏమై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా లైన్ 'నిన్ను నువ్వు ప్రేమించుకో' అనే సందేశంతో కొనసాగుతుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన వాళ్లంతా 'లవ్ యువర్ సెల్ఫ్' అనుకునేలా ఈ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కథపైనే కొరటాల కసరత్తు చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)