ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమితాబ్ కంటే దీపికకి ఎక్కువ ఇచ్చారట!

Thu, Sep 08, 2016
దీపికా పదుకొనె
దీపికా పదుకొనె
అమితాబ్ బచ్చన్ .. దీపికా పదుకొనె .. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన తారాగణంగా వచ్చిన 'పీకూ' .. ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకి గాను అమితాబ్ బచ్చన్ కంటే దీపికా పదుకొనెకు ఎక్కువ పారితోషికం ముట్టిందట. ఈ విషయాన్ని అమితాబ్ చెప్పడం విశేషం.

'పీకూ' సినిమా కోసం తనకంటే దీపికా పదుకొనెకి ఎక్కువ పారితోషికం ఇవ్వడం జరిగిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తనకంటే ఆమె ఈ సినిమాకి ముఖ్యమనుకుని అలా చేసి ఉండవచ్చనీ .. లేదంటే తాను చాలాకాలంగా నటిస్తూ వస్తున్నందు వలన తన పారితోషికం తగ్గించి ఉండవచ్చని ఆయన సరదాగా చమత్కరించారు.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)