ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొరటాల మాటలకి బోయపాటి సీరియస్?

Thu, Sep 08, 2016
కొరటాల శివ
కొరటాల శివ
దర్శకుడు కొరటాల శివ మంచి రచయిత కూడా. దర్శకుడిగా మెగా ఫోన్ పట్టడానికి ముందు ఆయన పలు సినిమాలకి కథ .. మాటలు అందించారు. అలాంటి కొరటాల శివ తాజాగా ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ, 'సింహ' సినిమాకి కథ .. మాటలు రాసింది తానేనని చెప్పారు.

అయితే కథకి గానీ మాటలకి గాని దేనికో ఒక దానికి మాత్రమే తన పేరును వేస్తానని బోయపాటి చెప్పారని అన్నారు. తనకి చాలా బాధ అనిపించి .. రెండింటికి వేయవద్దన్నాననీ, నిజంగానే తన పేరు స్క్రీన్ పై కనిపించలేదని చెప్పారు. దాంతో బోయపాటిని గురించిన గుసగుసలు మొదలయ్యాయి. ఎప్పటి సంగతో ఇప్పుడు కొరటాల ప్రస్తావించడం పట్ల బోయపాటి సీరియస్ గా వున్నాడని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బోయపాటి కూడా దీనిపై స్పందించే అవకాశం ఉందంటున్నారు. ఇలా ఇద్దరు దర్శకుల మధ్య ఈ విషయం మరింత ముదిరే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)