ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నయనతార ఫస్టు లుక్ వచ్చేసింది

Thu, Sep 08, 2016
కథా బలానికి నయనతార ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది .. కొత్తగా అనిపిస్తేనే ఆమె అంగీకరిస్తుంది. అందువల్లనే వరుస విజయాలు ఆమె ఖాతాలో వరుసగా చేరిపోతున్నాయి. అలా ఆమె అంగీకరించిన సినిమాల్లో 'డోరా' ఒకటి. 'డోరా' అంటే .. దేవుడిచ్చిన బహుమతి అని అర్థం.

నయనతార ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ తమిళ సినిమా నుంచి తాజాగా ఫస్టు లుక్ వచ్చింది. రాత్రివేళ నిర్మానుష్యమైన ప్రాంతంలో కారు ఫ్లడ్ లైట్స్ వెలుగులో నయనతార నుంచుని, ఆకాశం వైపు చూస్తోంది. భయాన్ని కలిగించే చిత్రమైన ఆకారమేదో ఆకాశంలో ఆమెకి కనిపిస్తోంది. వెనుక వైపు నుంచి నయనతార కనిపించే ఈ ఫస్టు లుక్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. దాస్ రామస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయమనిపిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)