ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్లైమాక్స్ చదివి ఏడ్చేసిన సుకుమార్

Wed, Sep 07, 2016
సుకుమార్
సుకుమార్
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అందులో భాగంగా ఈ సినిమాను గురించి దర్శకుడు సుకుమార్ మాట్లాడాడు.

అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన 'ఊహలు గుసగుసలాడే' చూసిన రోజునే ఆయనపై మంచి అభిప్రాయం కలిగిందని అన్నాడు. 'జ్యో అచ్యుతానంద' స్క్రిప్ట్ ను ఆయన కోరిక మేరకు చదివాననీ, మూడు ప్రధానమైన పాత్రల మధ్య ఈ కథ కొనసాగుతుందని చెప్పాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలను చదువుతున్నప్పుడు ఏడవకుండా వుండలేకపోయానని అన్నాడు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తనకి ఉందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)