ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృష్ణవంశీ దర్శకత్వంలో చరణ్?

Wed, Sep 07, 2016
చరణ్
చరణ్
కృష్ణవంశీ .. చరణ్ కాంబినేషన్లో గతంలో 'గోవిందుడు అందరివాడేలే' సినిమా వచ్చింది. ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా, తన కెరియర్లో తనకి బాగా నచ్చిన సినిమాల్లో 'గోవిందుడు అందరి వాడేలే' ఒకటని ఒక సందర్భంలో చరణ్ చెప్పాడు.

ఇక చరణ్ తో మరో సినిమా చేయవలసిందేనని కృష్ణవంశీ తో చిరూ అన్నట్టుగా ఆ మధ్య వార్తలు వినిపించాయి. త్వరలోనే ఆ దిశగా సన్నాహాలు మొదలు కానున్నాయని అనుకుంటున్నారు. చిరూ సూచనతో చరణ్ కోసం కృష్ణవంశీ ఒక కథను సిద్ధం చేసే పనిలో వున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' చేస్తోన్న చరణ్, ఆ తరువాత సుకుమార్ .. బోయపాటిలతో చేయనున్నాడు. ఆ తరువాతనే కృష్ణవంశీతో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)