ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజసూయ యాగంలో 'శాతకర్ణి'

Wed, Sep 07, 2016
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. బాలకృష్ణ .. హేమమాలిని .. శ్రియ తదితరులపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిన్నటి నుంచి రాజసూయ యాగానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ సమయంలోనే శాతకర్ణి తన తల్లి పేరును తన పేరుకి ముందు చేర్చుకుని, గౌతమీ పుత్ర శాతకర్ణిగా ప్రకటించుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. అంతటి కీలకమైన సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ నెల 20వ తేదీ వరకూ అక్కడ ఈ షెడ్యూల్ కొనసాగనుంది. బాలకృష్ణ 100 వ సినిమా కావడం వలన .. భారీ చారిత్రక నేపథ్యం కలిగిన కథ కావడం వలన, 'శాతకర్ణి' పై భారీ అంచనాలు వున్నాయి. వాటిని అందుకునే దిశగా క్రిష్ కృషి చేస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)