ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకత్వంపై దృష్టి పెడుతున్న హీరో!

Wed, Sep 07, 2016
ధనుశ్
ధనుశ్
తమిళ సినిమా హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుశ్ లో చాలా టాలెంట్ వుంది. ఒక్క నటుడిగానే కాకుండా, గాయకుడిగా, గీత రచయితగా, నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. మరోపక్క అప్పుడప్పుడు హిందీ సినిమాలలో కూడా నటిస్తున్నాడు. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పుడు తన దృష్టిని దర్శకత్వంపై పెడుతున్నాడు. ఒక సినిమాకి దర్శకత్వం వహించాలన్నది ధనుశ్ చిరకాల కోరిక. దానిని నెరవేర్చుకునే క్రమంలో ఇప్పుడు తను ఆ వైపు దృష్టి పెడుతున్నాడట. ఈ చిత్రం కోసం అప్పుడే స్క్రిప్టును కూడా సిద్ధం చేసుకుంటున్నాడని, ఇందులో రాజ్ కిరణ్ కథానాయకుడుగా నటిస్తాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ధనుశ్ నటించేది, లేనిదీ ఇంకా వెల్లడికాలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరి, ఈ కథానాయకుడు దర్శకుడిగా కూడా సక్సెస్ అవుతాడేమో చూద్దాం!
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)