ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జ్యో అచ్యుతానంద' కొత్తగా ఉంటుందట!

Tue, Sep 06, 2016
'జ్యో అచ్యుతానంద'లో ఓ దృశ్యం
'జ్యో అచ్యుతానంద'లో ఓ దృశ్యం
నారా రోహిత్ .. నాగశౌర్య .. రెజీనా ప్రధానమైన పాత్రలను పోషించిన 'జ్యో అచ్యుతానంద' చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ, వైవిధ్యభరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందినట్టుగా చెప్పాడు.

ఈ సినిమాలో కథానాయకులిద్దరికీ ముందుగానే పెళ్లిళ్లు అయినట్టుగా ఫస్టు షాట్ లోనే చెప్పేశాననీ, అక్కడి నుంచి కథను ఎలా నడిపించాననేదే ఆసక్తికరంగా ఉంటుందని అన్నాడు. గతంలో ఈ తరహా కథలు వచ్చినట్టు అనిపించినా, తాను ఇచ్చిన ముగింపు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పాడు. ఈ సినిమాకి వచ్చిన ప్రేక్షకులు కొత్తగా ఉందనుకుంటూ వెళతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)