ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్య సరసన నయనతార!

Tue, Sep 06, 2016
నయనతార
నయనతార
సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'సింగం 3' సినిమా, షూటింగ్ పరంగా ముగింపు దశకి చేరుకుంది. దాంతో ఆయన తదుపరి సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమాను ఆయన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది. 'కబాలి' దర్శకుడు రంజిత్ తో సూర్య నెక్స్ట్ మూవీ ఉంటుందని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన సూర్య మనసు మార్చుకున్నాడని చెబుతున్నారు.

విఘ్నేష్ శివన్ చెప్పిన కథ నచ్చడంతో ఆయనకి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతారని తీసుకుందామని విఘ్నేష్ శివన్ పట్టుబట్టాడట. ఈ విషయంలో సూర్యను ఒప్పించినట్టేనని చెబుతున్నారు. విఘ్నేష్ శివన్ .. నయనతార ప్రేమించుకుంటున్నారనే వార్తలు షికారు చేస్తోన్న నేపథ్యంలో, వాళ్ల కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటం మరింత విశేషాన్ని సంతరించుకుంది.
X

Feedback Form

Your IP address: 54.147.238.62
Movie News (Latest)