ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బోయపాటి దర్శకత్వంలో పవన్?

Tue, Sep 06, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
చిరంజీవి తన 151వ సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయాలని అనుకుంటున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ తరువాత సంవత్సరంలోనే పవన్ తో బోయపాటి సినిమా వుండే అవకాశం ఉందనే వార్త ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది.

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఒక సినిమా చేయనున్నట్టు, చాలా రోజుల క్రితమే దాసరి నారాయణరావు ప్రకటించారు. తాను నిర్మించే సినిమా పవన్ రాజకీయ జీవితానికి దోహదం చేసేదిలా వుండాలని దాసరి భావిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయాలని ఆయన నిర్ణయించుకున్నారట. ప్రజల సమస్యలు .. రాజకీయ అంశాలకి సంబంధించిన కథను రెడీ చేసుకోమని ఆయన బోయపాటికి చెప్పడం జరిగిపోయిందని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలకి ముందు ఆయన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)