ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిన్నటి తరం కథానాయకుడితో తమన్నా!

Mon, Sep 05, 2016
తమన్నా
తమన్నా
ప్రస్తుతం టాప్ హీరోలతో కలసి నటిస్తున్న మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా త్వరలో నిన్నటితరం కథానాయకుడితో కలసి నటించే అవకాశం కనిపిస్తోంది. 'రోజా', 'బొంబాయి' వంటి సినిమాలతో అందాల కథానాయకుడిగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం విలన్ తరహా క్యారెక్టర్లు పోషిస్తున్న అరవింద్ స్వామితో కలసి తమన్నా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. గతంలో వచ్చిన 'సతురంగ వెట్టయ్' అనే తమిళ సూపర్ హిట్ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో అరవింద్ స్వామి, తమన్నా జంటను నటింపజేయడానికి వారితో చర్చలు జరుగుతున్నట్టు కోలీవుడ్ సమాచారం. ఈ సీక్వెల్ లో నటించడానికి వీరిద్దరూ కూడా ఆసక్తిగా వున్నట్టు తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)