ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శాతకర్ణి' చిత్రాన్ని మొదట్లో చేయనన్న హేమమాలిని!

Mon, Sep 05, 2016
హేమమాలిని
హేమమాలిని
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా షూటింగు ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు. హేమమాలిని కూడా ఈ షూటింగులో పాల్గొంటున్నారు.

ఈ సినిమాను గురించి ఆమె మాట్లాడుతూ, ముందుగా తాను ఈ సినిమాను అంగీకరించలేదని చెప్పారు. తనకి తెలుగు రాకపోవడం వలన, ఈ సినిమా చేయడానికి అంగీకరించలేదని అన్నారు. అయితే 'శాతకర్ణి' తల్లి పాత్ర ఎంత గొప్పతో తెలిసిన తరువాత, తన నిర్ణయం మార్చుకున్నానని చెప్పారు. ఈ సినిమా సెట్లోని వారంతా చూపిస్తోన్న అభిమానం, తాను ఎప్పటికీ మరిచిపోలేనంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)