ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

జపాన్ లో రిలీజ్ అయిన 'జనతా గ్యారేజ్'

Sun, Sep 04, 2016
ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' చిత్రం ఇంటా బయటా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోను కలిపి ఇప్పటికి 30 కోట్ల వరకు షేర్ వసూలు అయిందని, అమెరికాలో మిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని ఈ రోజు నుంచి జపాన్ దేశంలో కూడా ప్రదర్శిస్తున్నారు. జపాన్ లో కూడా ఎన్టీఆర్ కు అభిమానులు బాగా వున్నట్టు మనకు తెలిసిందే. ఆయన డ్యాన్సులను అక్కడి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. దీంతో గత కొంత కాలంగా ఆయన సినిమాలు అక్కడ కూడా విడుదలవుతున్నాయి. ఆ క్రమంలో ఈ 'జనతా గ్యారేజ్' చిత్రాన్ని కూడా జపనీస్ సబ్ టైటిల్స్ తో అక్కడ రిలీజ్ చేసినట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)