ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Sep 04, 2016
ఇలియానా
ఇలియానా
* ఇటీవల విడుదలైన 'రుస్తుం' సినిమా విజయం సాధించడంతో గోవా బ్యూటీ ఇలియానాకు మళ్లీ బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కాగా, త్వరలో అజయ్ దేవగణ్, ఇమ్రాన్ హష్మిలతో కలసి 'బాద్షా హో' అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.
* ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తాను ముఖ్యపాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'మన ఊరి రామాయణం' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరాయి. కాగా, ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 7న విడుదల చేయనున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించాడు.
* వీఐ ఆనంద్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటిస్తున్న 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రం షూటింగ్ పూర్తికావస్తోంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్, నందిత శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* రామ్ చరణ్ నటిస్తున్న 'ధృవ' చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. నగర శివారులో కొన్ని కీలక సన్నివేశాలను ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రీకరిస్తున్నాడు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.166.74.94
Movie News (Latest)