ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్, చరణ్ కలిస్తే అల్లరే అల్లరి!

Sat, Sep 03, 2016
పవన్ కల్యాణ్ ఎవరితోను పెద్ద చనువుగా వుండరు .. అలాగని ఉద్దేశపూర్వకంగా దూరంగాను ఉండాలనుకోరు. ఆయనది ఒక ప్రత్యేకమైన మనస్తత్వం. అయితే చరణ్ విషయంలో మాత్రం ఆయన ఇందుకు మినహాయింపుగా కనిపిస్తారు. చరణ్ కనిపిస్తే చాలు .. ఆయనతో కలిసి సందడి చేస్తారు.

ఇక చరణ్ మాటల్లో ఒక్కసారైనా బాబాయ్ గురించి ప్రస్తావించడం జరుగుతుంది. తాను తన తండ్రి దగ్గరకన్నా బాబాయ్ దగ్గరే ఎక్కువ చనువుగా ఉంటానని చరణ్ చాలాసార్లు చెప్పాడు. పవన్ షూటింగ్ జరుగుతున్నా వెళ్లి, సెట్లో ఆయనతో ముచ్చట్లు పెడతాడు. స్టార్ హీరోలమనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, బాబాయ్ .. అబ్బాయ్ ల మాదిరిగానే కలిసి అల్లరి చేస్తారు. అలాంటి సమయంలో .. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా సెట్లో తీసిందే ఈ ఫోటో. ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమన్నది చెప్పడానికి ఈ ఫోటో ఒక్కటి చాలదూ. తాజాగా ఈ ఫోటోను చరణ్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)