ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీస్ పై ఎన్టీఆర్ దృష్టి

Sat, Sep 03, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ప్రేమకథలను ఎక్కువగా చేయలేకపోయాననే అసంతృప్తి అప్పుడప్పుడు తనని బాధిస్తూ ఉంటుందని ఎన్టీఆర్ ఇటీవల అన్నాడు. ఆ బాధ నుంచి బయటపడటానికేనన్నట్టుగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వున్న లవ్ స్టోరీలో చేయాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది.

'నిన్నే పెళ్లాడుతా' తరహా కథలను వినడానికే ఎన్టీఆర్ ఎక్కువ ఆసక్తిని చూపుతున్నాడని అంటున్నారు. కొత్తదనం కోసం ఈసారి అలాంటి సినిమాని చేయాలనే ఉద్దేశంతో ఆయన వున్నాడు. అందువల్లనే ఎమోషన్ ప్రధానమైన వక్కంతం వంశీ కథను కూడా పక్కకి పెట్టేశాడని చెబుతున్నారు. ఎన్టీఆర్ నిర్ణయం గురించి తెలుసుకున్న దర్శకులు కొంతమంది అప్పుడే ఈ తరహా కథలపై కసరత్తు చేస్తున్నారని సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)