ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ గ్లామర్ సీక్రెట్ అదేనట!

Sat, Sep 03, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ మంచి మనసున్న వ్యక్తి అనే విషయాన్ని చాలా సంఘటనలు నిరూపించాయి. అలాగే అవినీతిని .. అన్యాయాన్ని సహించడనే విషయం ఆయన మాటల ద్వారా అర్థమవుతూ ఉంటుంది. సామాజిక స్పృహను కలిగించే పుస్తకాలు .. వేదాంతం .. తత్త్వశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను ఆయన ఎక్కువగా చదువుతాడనే విషయం ఆయన ప్రసంగాల వలన తెలుస్తుంది.

అలాంటి పవన్ కల్యాణ్ గ్లామర్ ను గురించి అల్లు శిరీష్ కొన్ని విషయాలను చెప్పాడు. పవన్ కల్యాణ్ ఆయుర్వేదానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తాడనీ .. ఎక్కువగా ఉసిరికాయలు తింటాడని అన్నాడు. సాధ్యమైనంత వరకూ మానసికంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నిస్తాడని చెప్పాడు. క్రమం తప్పకుండా అష్టాంగ యోగా చేస్తాడనీ .. అదే ఆయన గ్లామర్ రహస్యమని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)