ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విమర్శలపై స్పందించిన కొరటాల

Fri, Sep 02, 2016
కొరటాల శివ
కొరటాల శివ
కొరటాల శివ దర్శకత్వం వహించిన 'జనతా గ్యారేజ్' సినిమా, నిన్ననే భారీస్థాయిలో విడుదలైంది. ఈ సినిమాలో సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా నటించారు. ఈ ఇద్దరి పాత్రలను కొరటాల ఎలా మలిచారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశ కలిగింది. సమంతా పాత్రకి గానీ .. నిత్యామీనన్ పాత్రకి గాని తాము ఆశించిన స్థాయి ప్రాధాన్యత లేకపోవడమే అందుకు కారణం.

ఈ సినిమా సక్సెస్ మీట్లో ఈ విమర్శ కొరటాల ముందుకురావడంతో, ఆయన తనదైన శైలిలో స్పందించారు. కథానాయికల పాత్రలు ఈ మేరకే ఉండాలనే ఆలోచనేం చేయలేదనీ, కథకి వాళ్ల పాత్రలు ఎంతవరకూ అవసరం అనిపించిందో అంతవరకే రాసుకున్నానని చెప్పారు. కథ మేరకు ఇద్దరి పాత్రలకి ఆ పరిధిలో ప్రాధాన్యత వుందని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)