ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గ్యారేజ్'లో ఆ సీన్ అదుర్స్ అంటున్నారు

Fri, Sep 02, 2016
'జనతా గ్యారేజ్' సినిమా చూసిన వాళ్లంతా ఒక సీన్ గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్ ఈ సినిమాకి హైలైట్ అని అంటున్నారు. ఈ సినిమాలో రాజీవ్ కనకాల ఒక సిన్సియర్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. అవినీతిపరులకి అండగా నిలవడం కంటే .. వాళ్లకి తలవంచి తప్పుడు పనులకి అనుమతిని ఇవ్వడం కంటే .. చనిపోవడం మంచిదనే ఆలోచనతో అతని పాత్ర కనిపిస్తుంది.

అలాంటి ఈ పాత్ర ఒక సాయం కోరి 'జనతా గ్యారేజ్'కి వస్తుంది. ఈ పాత్రకి అండగా నిలబడటానికి ఎన్టీఆర్ సిద్ధపడతాడు. ఇక్కడి నుంచి మొదలయ్యే ఎపిసోడ్ అదుర్స్ అని ఆడియన్స్ అంటున్నారు. దాదాపు 20 నిమిషాల నిడివిగల ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ నటన .. కొరటాల రాసిన సంభాషణలు వన్స్ మోర్ అనిపిస్తాయనీ, ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సీన్స్ లో ఇది ఒకటని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)