ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కోట్ల రూపాయల ఖర్చుతో 'భాగమతి' సెట్

Fri, Sep 02, 2016
అనుష్క
అనుష్క
సాంఘిక చిత్రాలలోనే కాదు .. జానపద .. పౌరాణిక .. చారిత్రక చిత్రాలకి సైతం వన్నె తెచ్చే కథానాయికగా అనుష్క కనిపిస్తుంది. అరుంధతి .. రుద్రమదేవి వంటి చిత్రాలు ఆమె నటనకి కొలమానాలుగా నిలుస్తాయి. అలాంటి అనుష్క కథానాయిక ప్రాధాన్యత కలిగిన మరో చిత్రంలో నటిస్తోంది .. ఆ సినిమా పేరే 'భాగమతి'.

చారిత్రక నేపథ్యం కూడా ఈ సినిమాలో ఒక భాగంగా కనిపిస్తుంది. 400 సంవత్సరాల క్రితం నాటి నేపథ్యాన్ని చిత్రకరించడానికి గాను 'భాగమతి' రాజభవనం సెట్ వేస్తున్నారు. ఈ భారీ సెట్ ఖర్చు మూడున్నర కోట్లు అని తెలుస్తోంది. ఆనాటి శిల్పకళను .. నిర్మాణ శైలిని దృష్టిలో పెట్టుకుని, ఈ సెట్ ను రూపొందిస్తున్నారట. సినిమా హైలైట్స్ లో ఇది ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. అశోక్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)