ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

త్రివిక్రమ్ తో పవన్ మూవీ ఖరారు

Fri, Sep 02, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ మంచి స్నేహితులు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' .. 'అత్తారింటికి దారేది' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. పవన్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తూనే ఉంటాడు. ఇక ఆయనతో సినిమా చేయడానికి పవన్ కూడా సిద్ధంగానే ఉంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో మళ్లీ ఓ సినిమా రావాలనే అభిమానులు కోరుకుంటూ వుంటారు.

వాళ్ల కోరిక త్వరలో నెరవేరనుంది. త్రివిక్రమ్ - పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమాను నిర్మించబోతున్నట్టుగా, హారికా హాసిని క్రియేషన్స్ వారు కొంతసేపటి క్రితం ప్రకటించారు. ఈ రోజున పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడం వలన, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ విషయాన్ని తెలియజేశారు. 'కాటమరాయుడు' తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)