ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'నిర్మలా కాన్వెంట్' వచ్చేస్తోంది

Fri, Sep 02, 2016
'నిర్మలా కాన్వెంట్'లో  రోషన్ - శ్రియాశర్మ
'నిర్మలా కాన్వెంట్'లో రోషన్ - శ్రియాశర్మ
శ్రీకాంత్ తనయుడు రోషన్ .. శ్రియాశర్మ జంటగా 'నిర్మలా కాన్వెంట్' చిత్రం రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి జి.నాగకోటేశ్వర రావు దర్శకత్వం వహించాడు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా, పోస్టర్స్ తోను .. టీజర్ తోను యూత్ లో ఆసక్తిని రేకెత్తించింది.

ఈ సినిమాలో నాగార్జున ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుండటం .. ఆయన ఒక పాట కూడా పాడటం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. మరి ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కి యూత్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)