ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీతో కాజల్ మరోసారి జోడీ!

Fri, Sep 02, 2016
కాజల్
కాజల్
కెరీర్ పరంగా ఆమధ్య కాస్త వెనుకబడిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మళ్లీ స్పీడందుకుంది. వరుసగా కొత్త చిత్రాలకు సంతకాలు చేస్తోంది. ఈ క్రమంలో గతంలో 'ఆర్య 2', 'ఎవడు' సినిమాలలో అల్లు అర్జున్ సరసన నటించిన కాజల్.. బన్నీతో మరోసారి జతకడుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 'డీజే... దువ్వాడ జగన్నాథం' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా కాజల్ ను పరిశీలిస్తున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. తాజాగా ఆమెనే ఫైనల్ చేసినట్టు, కాజల్ డేట్స్ కూడా కేటాయించినట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలవుతుంది. ఇదిలా ఉంచితే, మరోపక్క మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఖైదీ నంబర్ 150' చిత్రంలో కూడా కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే!
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)