ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సస్పెన్స్ కి తెరదించిన నాగార్జున!

Fri, Sep 02, 2016
నాగార్జున
నాగార్జున
అఖిల్ అక్కినేని నటించే తదుపరి సినిమా విషయంలో సస్పెన్స్ వీడింది. అఖిల్ నటించిన తొలిచిత్రం పరాజయం పాలవడంతో, తదుపరి చిత్రం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏ దర్శకుడితో చేయాలన్న విషయమై పెద్ద చర్చలే జరిగాయి. ఈ క్రమంలో పలు పేర్లు వినిపించాయి. అయితే, తాజాగా అఖిల్ తండ్రి నాగార్జున వీటికి తెరదించుతూ, అఖిల్ రెండో సినిమా 'మనం' ఫేం విక్రంకుమార్ తో ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విషయంపై ఆయన తాజాగా ట్వీట్ చేస్తూ, "సెప్టెంబర్ నెల రాకింగ్ అనే చెప్పాలి. నేను పనిచేసిన ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేస్తున్నాను. కల్యాణ్ కృష్ణతో నాగచైతన్య.. విక్రం కుమార్ తో అఖిల్ సినిమా వుంటాయి. త్వరలోనే ఇవి సెట్స్ కి వెళతాయి" అంటూ వెల్లడించారు. వీటిని నాగార్జున సొంత చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మిస్తుంది!
X

Feedback Form

Your IP address: 54.205.8.87
Movie News (Latest)