ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజా కాన్సర్ట్ లో ప్రకాశ్ రాజ్!

Thu, Sep 01, 2016
ఇళయరాజా
ఇళయరాజా
యుఎస్ఎ - కాలిఫోర్నియాలోని శాన్ జోన్ లో తెలుగువారి కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఓ కాన్సర్ట్ ను చేయడానికి అంగీకరించారు. విదేశాల్లో గతంలోను ఆయన కాన్సర్ట్స్ ను చేశారు. అయితే ఆ కార్యక్రమాల్లో తెలుగుతో పాటు తమిళ పాటలు ఉంటూ ఉండేవి. ఈసారి మాత్రం ఇళయరాజా స్వరపరచిన తెలుగు పాటలు మాత్రమే ఈ కార్యక్రమంలో పాడటం జరుగుతుందట.

బే ఏరియా తెలుగు అసోసియేషన్ వారు మరికొన్ని సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ శనివారం రోజున జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించనుండటం విశేషం. ఈ కార్యక్రమంలో చిత్ర .. సాధనా సర్గమ్ .. మనో .. కార్తిక్ .. ప్రియా హిమేష్ .. తదితర గాయనీగాయకులు పాల్గొననున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)