ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ సినిమాకు 'కాటమరాయుడు' ఖరారు

Thu, Sep 01, 2016
శరత్ మరార్
శరత్ మరార్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా డాలీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా శ్రుతిహాసన్ నటించనుంది. ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథ కావడంతో ఈ సినిమాకి 'కడప కింగ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా మొదట్లో వార్తలు వచ్చాయి.

ఇక ఈ మధ్య 'కాటమరాయుడు' అనే టైటిల్ ను పెట్టనున్నారనే టాక్ వినిపించింది. తాజాగా అదే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా, శరత్ మరార్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శరత్ మరార్ ఈ టైటిల్ ను ఖరారు చేసినట్టుగా చెప్పారు. ఇది నిజంగా పవన్ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)