ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హంగామా వద్దంటోన్న పవన్

Thu, Sep 01, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ పుట్టినరోజును అభిమానులు ఓ పండుగ రోజులా భావిస్తారు. ఆ రోజున అభిమానులంతా కలిసి కటౌట్లు .. ఫ్లెక్సీలు .. కేక్ కటింగ్ అంటూ సందడి చేస్తారు. అయితే రేపు తన పుట్టినరోజున అలాంటి హంగామా చేయవద్దని తన అభిమానులకు పవన్ సంకేతాలు పంపినట్టుగా తెలుస్తోంది.

సేవా కార్యక్రమాలు చేపడితే ఫరవాలేదుగానీ, హడావిడి చేయవద్దని ఫ్యాన్స్ కి సూచించాడని అంటున్నారు. ఈ పుట్టినరోజున ఆయన రాజకీయ .. సినీ ప్రముఖులకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాడట. ఆ రోజున ఎవరికీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని సమాచారం. పవన్ పుట్టినరోజున ఆయన తదుపరి సినిమాను ప్రకటించాలనుకున్న నిర్మాతలు, ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారట.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)