ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పూరీతోనే!

Thu, Sep 01, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చినా, ఆ ప్రాజెక్టు ఇంకా చర్చల దశలోనే వుందట.

అందువలన తన తదుపరి సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ కి పూరీ కథ వినిపించడం .. ఆయనకి నచ్చడం కూడా జరిగిపోయాయి. అయితే, ఈ సినిమాను ఎవరు నిర్మించనున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కల్యాణ్ రామ్ గానీ .. బీవీఎస్ఎన్ ప్రసాద్ గానీ .. కె.ఎస్. రామారావు గాని దీనిని నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)