ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఫారిన్ ట్రిప్ కి రెడీ అవుతోన్న ఎన్టీఆర్

Thu, Sep 01, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందిన 'జనతా గ్యారేజ్' సినిమా, ఈ రోజు ఉదయమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై టాక్ ఏమిటనేది మరికొంత సేపట్లో తెలియనుంది. ఈ సినిమా చేసిన ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు ఫారిన్ ట్రిప్ వేయనున్నట్టు తెలుస్తోంది.

'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగు కోసం ఎన్టీఆర్ చాలా రోజుల పాటు ఫ్యామిలీకి దూరంగా విదేశాల్లో వున్నాడు. ఆ వెంటనే ఆయన 'జనతా గ్యారేజ్' కోసం రంగంలోకి దిగాడు. పెద్దగా విరామమనేది తీసుకోకుండా ఆయన ఈ సినిమా షూటింగును పూర్తి చేశాడు. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లోను తీరికలేకుండా పాల్గొన్నాడు. అందువలన ఆయన ఒక నెల రోజుల పాటు విరామాన్ని తీసుకోనున్నాడట. అందులో ఓ 10 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో సరదాగా గడపనున్నట్టు తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చిన తరువాతనే ఆయన తదుపరి సినిమాను గురించిన విషయాలు తెలియనున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.197.72.5
Movie News (Latest)