ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వరుసగా రానున్న మెగా హీరోలు

Thu, Sep 01, 2016
చిరంజీవి
చిరంజీవి
మెగా హీరోల సినిమాలు రెడీ అవుతున్నాయంటే అభిమానులకి కలిగే ఆనందమే వేరు. అలాంటిది వాళ్ల సినిమాలు వరుసగా రానున్నాయంటే ఇక ఆ సంతోషం అంతా ఇంతా కాదు. చిరంజీవి 150వ చిత్రం 'సంక్రాంతి' పండుగ సందర్భంగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో అక్టోబర్లో మొదలయ్యే మూవీని ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు.

డాలీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తోన్న సినిమాని, మార్చ్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్ విషయానికి వస్తే, ఆయనకి ఏప్రిల్ సెంటిమెంట్ వుంది. ఆ మాసంలో వచ్చే తన సినిమాలు తప్పకుండా హిట్ కొడతాయని ఆయన భావిస్తుంటాడు. అందువలన ఆ నెలలో ఆయన 'దువ్వాడ జగన్నాధం' సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ తన తాజా చిత్రాన్ని మే నెలలో ఆడియన్స్ ముందు తీసుకురావాలని చూస్తున్నాడు. ఇక ఈ డిసెంబర్ లోనే 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్ రానున్నాడు. ఇలా మెగా హీరోలంతా వరుసగా అభిమానులను అలరించనున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)