ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లక్కీ ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!

Thu, Sep 01, 2016
అమలా పాల్
అమలా పాల్
అదృష్టమంటే అమలా పాల్ దే అంటున్నారు కోలీవుడ్ లో ఇప్పుడు. ఎందుకంటే, ఈ చిన్నది ఎకాఎకీన ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేస్తోందట. దర్శకుడు ఏఎల్ విజయ్ నుంచి విడిపోవడానికి సిద్ధపడిన అమలకు ఇక అవకాశాలు రావని ఇటీవల కోలీవుడ్ లో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, అందుకు భిన్నంగా ఈ ముద్దుగుమ్మ తాజాగా రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ పొందుతోందని అంటున్నారు.

'కబాలి' ఫేం రంజిత్ దర్శకత్వంలో రజనీ తన తదుపరి చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. రజనీ అల్లుడు ధనుశ్ నిర్మించే ఈ చిత్రంలో అమలా పాల్ ను కథానాయికగా ఎంపిక చేశారన్నది తాజా వార్త. ధనుశ్ తో అమలకు మంచి ర్యాపో వుంది. ఆయన తాజాగా నటిస్తున్న 'వడ చెన్నయ్' చిత్రంలో తనే కథానాయికగా నటిస్తోంది. ఆ నేపథ్యంలోనే ధనుశ్ ఈమెకు సూపర్ స్టార్ సరసన ఛాన్స్ ఇస్తున్నాడని అంటున్నారు. ఏమైనా, మిగతా వాళ్లకు మాత్రం అమల ఈ విధంగా షాక్ ఇస్తోందనే చెప్పాలి!
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)