ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలక్షణ నటుడికి ఘనమైన వేడుక

Wed, Aug 31, 2016
మోహన్ బాబు
మోహన్ బాబు
తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణమైన నటుడిగా .. విభిన్నమైన కథా చిత్రాల దర్శక నిర్మాతగా మోహన్ బాబుకి ప్రత్యేకమైన స్థానం వుంది. చిత్రపరిశ్రమలోకి ఆయన అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబసభ్యులు .. అభిమానులు కలిసి, సెప్టెంబర్ 17వ తేదీన వైజాగ్ లో ఒక భారీ వేడుకను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమలోనే ఇది ఘనమైన వేడుకగా నిలిచిపోతుందని అంటున్నారు. టాలీవుడ్ నుంచే కాకుండా ఇతర చిత్రపరిశ్రమలకి సంబంధించిన ప్రముఖులంతా ఈ వేడుకకి హాజరుకానున్నట్టు చెబుతున్నారు. మంచు విష్ణు .. మంచు మనోజ్ ఇద్దరూ కూడా దగ్గరుండి ఆ ఏర్పాట్లను చూసుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)