ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జాగ్వార్'లో తమన్నా స్పెషల్ సాంగ్

Wed, Aug 31, 2016
తమన్నా
తమన్నా
కథానాయికగా తెలుగు .. తమిళ భాషల్లో తమన్నా చాలా బిజీగా వుంది. అయినా అవకాశం దొరికినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ, భారీ పారితోషికమే వసూలు చేస్తోంది. అలాగే ఆమె 'జాగ్వార్' సినిమాలోను స్పెషల్ సాంగ్ తో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర సమర్పకులు .. హీరో నిఖిల్ కుమార్ తండ్రి కుమారస్వామి చెప్పారు.

ఈ సినిమాకి ఈ సాంగ్ హైలైట్ గా నిలుస్తుందని అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుందని చెప్పారు. జగపతిబాబు .. రమ్యకృష్ణ పాత్రలు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయని అన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించి, అక్టోబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నామని చెప్పారు.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)