ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తల్లి పాత్రలు చేస్తానంటోన్న హీరోయిన్

Wed, Aug 31, 2016
శిల్పాషెట్టి
శిల్పాషెట్టి
ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన చాలామంది కథానాయికలు, ఆ తరువాత తల్లి పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఏ భాషా చిత్రాల్లోనైనా ఈ పద్ధతి చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నదే. అలాగే తల్లి పాత్రలు ధరించడానికి తాను సిద్ధమంటూ మరో కథానాయిక రంగంలోకి దిగింది .. ఆమె పేరే శిల్పాషెట్టి.

నిన్నటి తరం కథానాయిక అయిన శిల్పాషెట్టి, బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోను నటించి అలరించింది. వివాహమైన తరువాత ఆమె సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇప్పటివరకూ వ్యాపార వ్యవహారాలలో భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చిన ఆమె, నటిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే తల్లి పాత్రలను పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని తెలియపరిచింది.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)