ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ తో సుకుమార్ అలా చెప్పాడట

Wed, Aug 31, 2016
చరణ్
చరణ్
చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' సినిమా చేస్తున్నాడు. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్లో మొదలుపెట్టనున్నట్టు కొంతకాలం క్రితమే చెప్పారు.

సాధారణంగా సుకుమార్ ఒక సినిమాను అందించడానికి ఎక్కువ సమయమే తీసుకుంటాడు. దాంతో ఈ కాంబినేషన్లో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఏమో అని అభిమానులు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యేలా చూస్తానని చరణ్ తో సుకుమార్ చెప్పాడట. నాలుగు నెలల్లో ఆయన సినిమాను పూర్తి చేస్తానని చెప్పడంతో, చరణ్ మాంచి ఉత్సాహంగా వున్నాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)