ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమిళంలోను 'జనతా గ్యారేజ్' భారీ రిలీజ్

Tue, Aug 30, 2016
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' రూపొందింది. ఈ సినిమాలో సమంతా .. నిత్యామీనన్ కథానాయికలుగా కనిపించనుండగా, మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. మలయాళంలోనే కాదు తమిళంలోను మోహన్ లాల్ కి ఇమేజ్ వుంది. ఇక సమంతా .. నిత్యామీనన్ ఇద్దరికీ కూడా తమిళంలో క్రేజ్ వుంది. అందువలన తెలుగు .. మలయాళ భాషలతో పాటు తమిళంలోను ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. తమిళనాట 100కి పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తెలుగులో ఎన్టీఆర్ సినిమాకి 100 థియేటర్లు అంటే చాలా తక్కువే. అయితే ఒక అనువాద చిత్రంగా తమిళనాట ఈ స్థాయి థియేటర్లలో విడుదల చేస్తుండటం నిజంగా విశేషమే. 'బాహుబలి'ని మినహాయిస్తే ఈ మధ్యకాలంలో ఈ స్థాయి థియేటర్లలో రిలీజ్ చేస్తోన్న తెలుగు సినిమా ఇదేనని అంటున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి తమిళ .. మలయాళ మార్కెట్లో పట్టు దొరుకుతుందని భావిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)