ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఎన్టీఆర్' అని పిలిస్తే భయంగా ఉంటుందట!

Tue, Aug 30, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
ఎన్టీఆర్ తాజా చిత్రం 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 1వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. ప్రస్తుతం ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో.. మీరు ఎన్టీఆర్ అని పిలిపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారా? లేక తారక్ అని పిలిపించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారా? అంటూ ఎదురైనా ఒక ప్రశ్నకి ఆయన తనదైన శైలిలో స్పందించాడు.

ఎన్టీఆర్ మహానుభావుడనీ .. ఆయన పేరు పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉంటానని చెప్పాడు. అయితే ఆయన పేరుతో పిలిస్తే ఒక విధమైన భయం కలుగుతూ ఉంటుందని అన్నాడు. ఆయన అంతటి గొప్పతనాన్ని కలిగి ఉండటమే అందుకు కారణమని చెప్పాడు. తన తల్లితో పాటు స్నేహితులు .. సన్నిహితులు తారక్ అనే పిలుస్తూ ఉంటారని అన్నాడు. నటనలో ఆయన 100 మెట్లు ఎక్కేస్తే .. తాను ఒకటి రెండు మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పు కొచ్చాడు. అలా ఆయన తాతగారి పట్ల గౌరవభావాన్ని చాటుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.146.141.60
Movie News (Latest)