ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మలయాళ రీమేక్ లో అల్లరి నరేష్

Tue, Aug 30, 2016
అల్లరి నరేష్
అల్లరి నరేష్
అల్లరి నరేష్ తాజాగా ఓ మలయాళ చిత్రం రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 'ఒరు వడక్కన్ సెల్ఫీ' అనే పేరుతో మలయాళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను బొప్పన చంద్రశేఖర్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందనున్నట్టు చెప్పాడు. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నాడని అన్నాడు. అక్టోబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నామనీ, అల్లరి నరేష్ ఇంతవరకూ చేసిన వైవిధ్యభరితమైన సినిమాల్లో ఇది ఒకటిగా నిలవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)