ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆడియో రిలీజ్ డేట్ చెప్పనున్న 'మజ్ను'

Tue, Aug 30, 2016
విరించి వర్మ దర్శకత్వంలో 'మజ్ను' చిత్రం రూపొందుతోంది. నాని కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, స్టాప్ డ్రింకింగ్ .. స్టార్ట్ లవ్ అనే లైన్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అందించిన ఆడియో అసలు ఈపాటికి సందడి చేసేదే కానీ, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ సినిమా ఆడియో వేడుకను వచ్చేనెల 4వ తేదీన జరపనున్నారనేది తాజా సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ కి మంచి పేరుంది. అలాగే దర్శకుడు విరించి వర్మ .. కథానాయకుడు నాని సక్సెస్ లతో వున్నారు. అందువలన ఈ సినిమా యూత్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ మూవీ కూడా నాని హిట్ చిత్రాల జాబితాలో చేరుతుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)