ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హైదరాబాద్ రోడ్లపై సైకిల్ తొక్కుతోన్న అనుష్క

Tue, Aug 30, 2016
అనుష్క
అనుష్క
'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క బాగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసం బరువు పెరిగినంత తేలికగా ఆమె ఇప్పుడు బరువు తగ్గలేకపోతోంది. ముఖ్యంగా 'భాహుబలి 2' షూటింగులో ఆమె పాల్గొనే సమయం దగ్గర పడుతోంది. దాంతో మొదటిభాగంలో కనిపించిన విధంగా తయారు కావడానికి అనుష్క నానా తంటాలు పడుతోంది.

బరువు తగ్గడానికి తనకి తెలిసిన పద్ధతులు పాటిస్తూ వస్తోన్న అనుష్క, వాటిలో భాగంగా సైకిల్ తొక్కుతోందట .. అదీ హైదరాబాద్ రోడ్లపైన. తనని ఎవరూ గుర్తించకుండా ముఖానికి మాస్క్ కట్టుకుని, ప్రతి రోజు ఉదయం 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతోందని అంటున్నారు. రాజమౌళి పెట్టిన డెడ్ లైన్ లోగా సన్నబడటానికి ఆమె ఇలా తిప్పలు పడుతోంది. మరి ఆలోగా ఆమె ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)