ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

క్రికెట్ ఆడేసిన 'బాహుబలి 2' టీమ్

Tue, Aug 30, 2016
ప్రభాస్
ప్రభాస్
'బాహుబలి 2' సినిమా షూటింగ్ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని రోజులుగా ఇక్కడ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రధాన తారాగణం ఈ షూటింగులో పాల్గొంటోంది. ఈ రోజుతో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడం పూర్తి కావలసి వుంది. అయితే అనుకోకుండా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. దాంతో షూటింగుకి అంతరాయం ఏర్పడింది. షూటింగును ఆపేసిన ఈ సినిమా టీమ్ .. లొకేషన్లో సరదాగా క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. అలా షూటింగ్ లొకేషన్ క్రికెట్ మైదానంగా మారిపోయిందన్న మాట. భారీ బడ్జెట్ తో .. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమాను, 2017 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు. రెండవభాగం 'బాహుబలి'ని మించిన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఈ సినిమా టీమ్ వుంది.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)