ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మలయాళ దర్శకుడితో వెంకీ ప్రాజక్ట్

Tue, Aug 30, 2016
వెంకటేశ్
వెంకటేశ్
ప్రస్తుతం 'సాలా ఖాడూస్' చిత్రం తెలుగు రీమేక్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు వెంకటేశ్ తన తదుపరి చిత్రాలను లైన్లో పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేసే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమధ్య వెంకటేశ్ నటించిన హిట్ చిత్రం 'దృశ్యం' మలయాళ మాతృకకు దర్శకత్వం వహించింది జీతూనే! దీంతో అతనితో వర్క్ చేయాలన్న ఆకాంక్షను అప్పట్లోనే వెంకీ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జీతూ హైదరాబాదుకి వచ్చి, ఈయనకు ఓ కథను చెప్పాడని, అది వెంకటేశ్ కు నచ్చిందని అంటున్నారు. దీంతో ఫుల్ స్క్రిప్ట్ తయారుచేసుకుని రమ్మని ఆ దర్శకుడుకి వెంకీ చెప్పాడట. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)