ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అల్లుడికి సినిమా చేస్తున్న సూపర్ స్టార్!

Tue, Aug 30, 2016
రజనీకాంత్
రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అల్లుడు ధనుశ్ కి ఓ సినిమా చేసిపెడుతున్నాడు. అవును, వుండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై ధనుశ్ నిర్మించే సినిమాలో రజనీ హీరోగా నటించడానికి అంగీకరించాడు. దీనికి 'కబాలి' దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తాడు. ఈ విషయాన్ని ధనుశ్ స్వయంగా ట్వీట్ చేశాడు. "సూపర్ స్టార్ రజనీతో మా తదుపరి చిత్రాన్ని నిర్మించనున్నామని తెలియజేయడానికి చాలా గర్వంగా వుంది' అంటూ ధనుశ్ పేర్కొన్నాడు.
కాగా, ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ 'రోబో' సీక్వెల్ చేస్తున్న సంగతి విదితమే. ఇది పూర్తవగానే ధనుశ్ సినిమా మొదలవుతుంది. ఇటీవల రంజిత్ దర్శకత్వంలో రజనీ నటించిన 'కబాలి' సినిమా మంచి హిట్టవడంతో, మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించడానికే సూపర్ స్టార్ ఓకే చెప్పాడు. బహుశా ఇది 'కబాలి'కి సీక్వెల్ గా తెరకెక్కుతుందని కోలీవుడ్ సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)