ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ జోడీగా కాజల్ ను తీసుకుంటారా?

Mon, Aug 29, 2016
కాజల్
కాజల్
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'దువ్వాడ జగన్నాధం' చిత్రం షూటింగ్ మొదలైంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభానికి ముందు దిల్ రాజు .. హరీష్ శంకర్ 'ఖైదీ నెంబర్ 150' సెట్ కి వెళ్లారు. చిరంజీవి .. వినాయక్ .. కాజల్ తో కాసేపు మాట్లాడి వచ్చేశారు.

ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది. తమ సినిమాలో అల్లు అర్జున్ జోడీగా కాజల్ ను ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే దిల్ రాజు - హరీష్ శంకర్ అక్కడికి వెళ్లారని .. ఆ విషయమే మాట్లాడి ఉంటారని చెప్పుకుంటున్నారు. గతంలో అల్లు అర్జున్ - కాజల్ 'ఎవడు' సినిమాలో జంటగా కనిపించారు. హిట్ కొట్టిన ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఆ సెంటిమెంట్ తోనే దిల్ రాజు ఆలోచన చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.168.21
Movie News (Latest)