ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొత్త షెడ్యూల్ మొదలెట్టిన 'శాతకర్ణి'

Mon, Aug 29, 2016
క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం తెరకెక్కుతోంది. మొరాకో .. జార్జియా .. హైదరాబాద్ లలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. క్రిష్ వివాహం సందర్భంగా ఈ సినిమా షూటింగుకి కొంతకాలం పాటు విరామాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ కి మధ్యప్రదేశ్ లో రంగాన్ని సిద్ధం చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగనుంది.

ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ తల్లిపాత్రలో హేమమాలిని .. భార్య పాత్రలో శ్రియ కనిపించనున్నారు. బాలకృష్ణ 100వ సినిమాగా చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమాపై, అభిమానులందరిలోను ఆసక్తి పెరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)