ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శభాష్ నాయుడు' పనిలో కమల్

Mon, Aug 29, 2016
కమల్
కమల్
కొంత విరామం తర్వాత ప్రముఖ నటుడు కమలహాసన్ మళ్లీ తన సినిమా పని మొదలు పెట్టారు. సుమారు నెలా పదిహేను రోజుల క్రితం చెన్నయ్ లో తన ఆఫీసులో మెట్లు ఎక్కుతూ జారిపడిన కమల్, అప్పటి నుంచీ మంచానికే పరిమితమయ్యారు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో తన తాజా చిత్రం 'శభాష్ నాయుడు'కు సంబంధించిన వర్క్ ను ప్రారంభించినట్టు కమల్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన పేపర్ వర్క్ ను మొదలుపెట్టానని, ఇప్పుడు తన కాళ్ల మీద తాను నిలబడి నడవగలుగుతున్నానని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. తన యాక్సిడెంటుకు సంబంధించిన పూర్తి స్టోరీని త్వరలో చెబుతానని, అది చెప్పదగిన స్టోరీ అని కమల్ ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'శభాష్ నాయుడు' సినిమాలో ఆయన కూతురు శ్రుతి హాసన్ కూడా నటిస్తున్న సంగతి విదితమే!
X

Feedback Form

Your IP address: 50.16.107.222
Movie News (Latest)