ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'గ్యారేజ్' అంచనా 3 మిలియన్ డాలర్లు!

Mon, Aug 29, 2016
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ - మోహన్ లాల్ -
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ - మోహన్ లాల్ -
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'జనతా గ్యారేజ్' .. సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. కాంబినేషన్ పరంగా ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

గతంలో ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' సినిమా అక్కడ 1మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసింది. 'నాన్నకు ప్రేమతో' సినిమా 2 మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో 'జనతా గ్యారేజ్' 3 మిలియన్ డాలర్లను రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాను ఈ సినిమా అవలీలగా అందుకుంటుందనే నమ్మకంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)